శనివారం రాత్రి వాయవ్య మడగాస్కర్ తీరం దగ్గర్లోని హిందూ సముద్రజలాల్లో పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 34 మంది జల సమాధి అయ్యారు. వీరంతా బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలసవెళ్తున్న శరణార్థులుగా గుర్తించారు.
మడగాస్కర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్రాన్స్ అధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్ దేశంలోని అంబిలోబే, టమతమే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఒక పడవలో బయల్దేరారు.మార్గమధ్యంలో నోసీ బే అనే ద్వీపం సమీపంలో హిందూ సముద్రజలాల్లో పడవ మునిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. 24 మందిని అక్కడి మత్స్యకారులు కాపాడారు.
Here's Update
Madagascar: death toll rises to 34 in shipwreck near Mayotte https://t.co/X5MGzbGrAO
— africanews 😷 (@africanews) March 15, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)