రష్యాలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయాలయ్యాయి. రష్యాలోని సదర్న్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్థాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. మృతి చెందినవారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు. కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో మంటలు ప్రారంభమై, సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురిని చికిత్స నిమిత్తం మాస్కోకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. రష్యా అధికారులు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ దర్యాఫ్తు ప్రారంభించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)