నైజీరియా దేశం లాగోస్ నగరంలోని ఐకెజా ఏరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతున్న ఓ ప్రయాణికుల బస్సును వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టింది. అనంతరం బస్సును ట్రాక్ వెంట కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 90 మంది ఉన్నారు. బస్సును రైలు డీకొట్టిన ఘటన తెలియగానే స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
Here's UPdate
Nigeria: Six killed, dozens injured after bus collides with running train in Lagos#Nigeria #BusTrainCollision
Read- https://t.co/KxsjwyUzk4
— India TV (@indiatvnews) March 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)