భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌ (Bhutan) చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన మోదీ ఆ దేశ రాజధాని థింపులో ల్యాండ్‌ అయ్యారు. ప్రధానికి భూటాన్‌లోని పారో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఆ దేశ ప్రధాని షెరిగ్‌ టోబ్గే ఘన స్వాగతం పలికారు.తాజా పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. అదేవిధంగా రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలకు మోదీ హాజరుకానున్నారు.

తాజా పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్యూక్‌ గ్యాల్పో’ను మోదీకి అందజేయనున్నారు. ఈ అవార్డును మోదీకి 2021లోనే ప్రకటించారు. అప్పటి నుంచి ఆ దేశానికి వెళ్లే అవకాశం ప్రధానికి రాలేదు. ఇప్పుడు ఆ అవార్డును భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ చేతుల మీదుగా మోదీ స్వయంగా అందుకోనున్నారు.

Heres' Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)