భారత ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన 'న్గడగ్ పేల్ గి ఖోర్లో'ను (Ngadag Pel gi Khorlo) మోదీకి ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి (PM Narendra Modi) ఇవ్వాలని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మే వాంగ్ చుక్ సూచించారని తెలిపింది. భూటాన్ కు అన్ని విధాలుగా, అన్ని సమయాల్లో ప్రధాని మోదీ అందిస్తున్న సాయాన్ని తమ రాజు ప్రధానంగా ప్రస్తావించారని పేర్కొంది. భూటాన్ కు కొన్నేళ్లుగా మోదీ ఎంతో సాయం చేశారని... ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో మోదీ అందించిన స్నేహహస్తం వెలకట్టలేనిదని కొనియాడింది.

తమ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి (PM Modi Honoured With Bhutan's Highest Civilian Award) మోదీ అత్యంత అర్హులని చెప్పింది. తమ దేశ ప్రజలందరి తరపున మోదీకి శుభాకాంక్షలు చెపుతున్నామని తెలిపింది. కాగా 2008లో ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని భూటాన్ నెలకొల్పింది. ఇంత వరకు ఏ విదేశీయుడికి ఈ పురస్కారాన్ని భూటాన్ ఇవ్వలేదు. ఈ పురస్కారాన్ని అందుకోబోతున్న తొలి విదేశీయుడు మోదీ కావడం గమనార్హం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)