బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఛార్లెస్-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ వివరించింది. అయితే, అది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని తెలిపింది. అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడి కాలేదు. దీంతో, కింగ్ ఛార్టెస్ సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ వివరించింది. కాగా, క్యాన్సర్‌కు చికిత్స పూర్తి చేసుకుని త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొంది. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు. 2022 సెప్టెంబరులో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 96 ఏళ్ల వయసులో మరణించడం వల్ల ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా ఎన్నికయ్యారు.
Here's News
BREAKING: King Charles III has been diagnosed with cancer. pic.twitter.com/ox8iyhkRYY
— Daily Loud (@DailyLoud) February 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)