వలస వ్యతిరేక గ్రూపులు బ్రిటన్‌లోని పలు నగరాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ తరుణంలో అక్కడున్న భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు లండన్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసింది. యూకేలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్ల గురించి భారత ప్రయాణికులకు తెలిసే ఉంటుంది. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. భారత్ నుంచి వచ్చే పర్యటకులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాం.  బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు, భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదని తెలిపిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌

స్థానిక మీడియా సంస్థలు, భద్రతా ఏజెన్సీలు ఇచ్చే సూచనలను అనుసరించాలి. నిరసనలు జరుగుతోన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి’’ అని హై కమిషన్ సూచించింది. ఇంగ్లాండ్‌లో కొద్దిరోజుల క్రితం ఓ డ్యాన్స్‌ క్లాస్‌లోని చిన్నారులపై దుండగులు కత్తులతో దాడి చేయడం సంచలనం రేపింది. ఆ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతిచెందడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. అది కాస్తా వలస వ్యతిరేక నిరసనలకు దారితీసింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)