మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆరుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా జట్టుకు.. దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను బోల్తా కొట్టించింది. తద్వారా సొంతగడ్డ (దక్షిణాఫ్రికా 2023)పై జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు మెగా టోర్నీ జరిగితే ఏడుసార్లు ఫైనల్ చేరిన ఆ్రస్టేలియా జట్టును ఈసారి దక్షిణాఫ్రికా టైటిల్ పోరుకు దూరం చేసింది.
వీడియో ఇదిగో, సర్ఫరాజ్ ఖాన్‌ను తిడుతూ ఫైర్ అయిన రోహిత్ శర్మ, ఇంత కోపమెందుకు అంటున్న నెటిజన్లు
ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. బెత్ మూనీ (44; 2 ఫోర్లు), ఎలీస్ పెరీ (31; 2 ఫోర్లు), కెపె్టన్ తాలియా మెక్‌గ్రాత్ (27; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయ»ొంగ ఖాకా 2, మరిజాన్ కాప్, ఎమ్‌లాబా చెరో వికెట్ తీశారు. తర్వాత దక్షిణాఫ్రికా మరో 2.4 ఓవర్లు మిగిలుండగానే 17.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి గెలిచింది.
కెప్టెన్ , ఓపెనర్ లౌరా వోల్‌వార్ట్ (37 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనెకె బాష్ (48 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు,1 సిక్స్) రెండో వికెట్‌కు చకచకా 96 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. నేడు రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆడుతుంది.