భారత-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. బుమ్రా (19), కుల్దీప్‌ (27) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శతకంతో చెలరేగాడు. ధర్మశాల మ్యాచ్‌లో 13 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 154 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు.  సిక్స్ కొట్టి హాప్ సెంచరీ పూర్తి చేసుకున్న దేవదత్ పడిక్కల్, ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీతో కదం తొక్కిన భారత్ యువ ఆటగాడు, వీడియో ఇదిగో..

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మధ్య 171 పరుగుల భాగస్వామ్యానికి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెరదించాడు. 162 బంతుల్లో 103 పరుగుల వద్ద రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా కాలంగా బౌలింగ్ చేయని స్టోక్స్ అద్భుతమైన డెలివరీ సంధించాడు. అది ఆఫ్ స్టంప్ వికెట్లను గిరాటేసింది. ఔటైన అనంతరం ఆ బంతిని చూసి ఆశ్చర్యపోయినట్లుగా రోహిత్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి నిరాశగా మైదానాన్ని వీడాడు. వ్యాఖ్యాతగా ఉన్న సంజయ్ మంజ్రేకర్ ఆ బంతిని మ్యాజికల్ బాల్‌గా అభివర్ణించాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)