Devdutt Padikkal Hits a Six To Complete His Maiden Test Half-Century on Debut, Achieves Feat During IND vs ENG 5th Test 2024

భారత-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. బుమ్రా (19), కుల్దీప్‌ (27) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టులో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేశాడు.

అతను తన తొలి మ్యాచ్ లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పడిక్కల్ బంతిని సిక్సర్ బాది యాభైకి చేరుకున్నాడు. భారత్‌కు రెండు వికెట్లు త్వరితగతిన పడిన తర్వాత అతను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మంచి టచ్‌లో కనిపించాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి పడిక్కల్ భారత్ ఇన్నింగ్స్‌పై పట్టు సాధించాడు. అతను ప్రధానంగా ఆఫ్‌సైడ్ వైపు అద్భుతమైన షాట్‌లను ప్రదర్శించాడు.  అశ్విన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు, 100వ టెస్ట్ ఆడుతున్న 14వ ఇండియన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పిన టీమిండియా స్పిన్నర్

Here's Video