India Vs Pakistan

New Delhi, SEP 10: ఆసియా క‌ప్‌లో భార‌త్(Team India), పాకిస్థాన్(Pakistan) సూప‌ర్ 4 మ్యాచ్‌కు పూర్తిగా సాగేలా లేదు. వ‌ర్షం కార‌ణంగా ఇప్ప‌టికే గంట‌కుపైగా ఆట నిలిచిపోయింది. ఒక‌వేళ వాన‌ త‌గ్గినా కూడా ఔట్‌ఫీల్డ్ త‌డిగా ఉండ‌డంతో ఓవ‌ర్ల‌ను కుదించే అవ‌కాశం ఉంది. అయితే.. 7:30కి ఓసారి అంపైర్లు పిచ్‌ను ప‌రిశీలించ‌నున్నారు. అప్ప‌టికీ పిచ్ అనుకూలంగా లేకుంటే మ్యాచ్‌ను డ‌క్‌వ‌ర్త్ లూయిస్(Duckworth-Lewis) ప్ర‌కారం 20 ఓవ‌ర్లకు కుదిస్తారు. అదే జ‌రిగితే.. ఆ పాకిస్థాన్‌కు 180 ప‌రుగుల లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు.

 

ఊహించిన‌ట్టుగానే భార‌త్, పాక్ మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. 24.1వ ఓవ‌ర్ స‌మ‌యంలో వాన మొద‌లైంది. దాంతో, గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌తో క‌ప్పేశారు. అప్ప‌టికీ భార‌త్ స్కోర్.. 147/2. విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) ఆడుతున్నారు. కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో భార‌త్ వెంట వెంట‌నే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శ‌ర్మ‌(56 : 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఔటైన త‌ర్వాతి ఓవ‌ర్లోనే శుభ్‌మ‌న్ గిల్(58 : 52 బంతుల్లో 10 ఫోర్లు) వెనుదిరిగాడు. షాహీన్ ఆఫ్రీదీ ఓవ‌ర్లో అఘా స‌ల్మాన్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. దాంతో, 124 ప‌రుగుల వ‌ద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది.