ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. వైజాగ్ మ్యాచ్‌లో శనివారం నాటి ఆటలో దుమ్మురేపిన ఈ ఫాస్ట్‌బౌలర్.. అంతర్జాతీయ టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.అతి తక్కువ బంతుల్లోనే ఈ ఘనత సాధించిన భారత తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.ఈ మ్యాచ్ లో మొత్తంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాటు తన కెరీర్‌లో టెస్టుల్లో పదోసారి ఐదు వికెట్లు సాధించిన రికార్డును కూడా నెలకొల్పాడు.
అంతర్జాతీయ టెస్టుల్లో తక్కువ బంతుల్లోనే 150 వికెట్ల క్లబ్‌లో చేరిన భారత బౌలర్లలో వరుసగా 6781 బాల్స్- జస్‌ప్రీత్ బుమ్రా, 7661 బాల్స్- ఉమేశ్ యాదవ్,
7755 బాల్స్- మహ్మద్ షమీ, 8378 బాల్స్- కపిల్ దేవ్, 8380 బాల్స్- రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ వెనుకకు పరిగెత్తుతూ అందుకున్న అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో, భారీ షాట్లతో భారత్ బౌలర్లను హడలెత్తించిన జాక్ క్రాలీని పెవిలియన్‌కు..
Here's News
𝗙𝗜𝗙𝗘𝗥! 🙌 🙌
1⃣0⃣th five-wicket haul in Tests for Jasprit Bumrah! ⚡️ ⚡️
The #TeamIndia vice-captain has been on a roll here in Vizag 👏 👏
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/dxaQeBICT6
— BCCI (@BCCI) February 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)