Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్, ఫిట్‌ నెస్‌ టెస్టులో పృథ్వీ షా విఫలం, కనీస స్కోరును అందుకోలేక చేతులెత్తేసిన షా, అయినా ఫర్వాలేదంటున్న టీం

New Delhi, March 17: ఐపీఎల్‌కు (IPL) ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కు షాక్ తగిలింది. ఆ టీంలో కీలక ఆటగాడిగా ఉన్న పృధ్వీ షా (Prithvi Shaw) ఫిట్ నెస్ టెస్టులో విఫలమయ్యాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) క్యాంపులో ఐపీఎల్‌ ఆటగాళ్లకు నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్ష వివరాలను ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరీక్షల్లో గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్య పాస్‌ కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) కీలక ఆటగాడు పృథ్వీ షా విఫలమయ్యాడు. యోయో టెస్ట్‌లో నిర్దేశించిన కనీస స్కోర్‌ను పొందడంలో హార్ధిక్‌ ఉత్తీర్ణత సాధించగా, ఢిల్లీ ఓపెనర్ చేతులెత్తేశాడు. అయితే, ఇది కేవలం ఫిట్‌నెస్ టెస్ట్ (Fitness test) మాత్రమేనని, ఇందులో విఫలమైతే ఐపీఎల్‌లో ఆడకుండా ఆపలేమని బీసీసీఐ స్పష్టం చేయడంతో డీసీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

Ravichandran Ashwin: రవి చంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు

యోయో టెస్ట్‌లో (Yoyo Test) బీసీసీఐ నిర్ధేశించిన కనీస స్కోర్‌ 16.5 కాగా, షా 15 కంటే తక్కువ స్కోర్ చేసినట్లు, హార్ధిక్‌ 17కి పైగా స్కోర్‌ సాధించినట్లు తెలుస్తుంది. కాగా, బీసీసీఐ కాంట్రాక్ట్‌, నాన్ కాంట్రాక్ట్ నేషనల్‌ లెవెల్ ప్లేయర్లకు బీసీసీఐ ఇటీవలే 10 రోజుల ఫిట్‌నెస్ క్యాంప్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఆడేందుకు అర్హత ఉన్నప్పటికీ...పృథ్వీ షా ఫిట్ నెస్ సరిగ్గా లేకపోవడం ఆ టీం కు పెద్ద దెబ్బ అవుతుంది.