Rain Delays Toss For First Test: భార‌త్-న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ కు వాన అడ్డంకి, ఉద‌యం నుంచి కురుస్తున్న వ‌ర్షం, టాస్ ఆల‌స్యం, రోజంతా వర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌న్న‌ ఐఎండీ

ఇండియా, న్యూజిలాండ్(IND vs NZ) మ‌ధ్య ఇవాళ బెంగుళూరులో తొలి టెస్టు ప్రారంభంకానున్న‌ది. అయితే వ‌ర్షం వ‌ల్ల ప్ర‌స్తుతం టాస్ ఆల‌స్యం (Rain Delays Toss) అవుతోంది. బెంగుళూరులో ఇవాళ ఉద‌యం నుంచి ఏక‌ధాటిగా వ‌ర్షం కురుస్తోంది. దీంతో చిన్న‌స్వామి స్టేడియం (Chinna swamy Stadium) చిత్త‌డిగా మారింది. గ్రౌండ్‌లో ఇంకా క‌వ‌ర్స్ అలాగే ఉండిపోయాయి.

Rain Delays Toss For First Test: భార‌త్-న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ కు వాన అడ్డంకి, ఉద‌యం నుంచి కురుస్తున్న వ‌ర్షం, టాస్ ఆల‌స్యం, రోజంతా వర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌న్న‌ ఐఎండీ
Rain Delays Toss For First Test (PIC@ X)

Bangalore, OCT 16: ఇండియా, న్యూజిలాండ్(IND vs NZ) మ‌ధ్య ఇవాళ బెంగుళూరులో తొలి టెస్టు ప్రారంభంకానున్న‌ది. అయితే వ‌ర్షం వ‌ల్ల ప్ర‌స్తుతం టాస్ ఆల‌స్యం (Rain Delays Toss) అవుతోంది. బెంగుళూరులో ఇవాళ ఉద‌యం నుంచి ఏక‌ధాటిగా వ‌ర్షం కురుస్తోంది. దీంతో చిన్న‌స్వామి స్టేడియం (Chinna swamy Stadium) చిత్త‌డిగా మారింది. గ్రౌండ్‌లో ఇంకా క‌వ‌ర్స్ అలాగే ఉండిపోయాయి. అయితే ఇవాళ రోజంతా జ‌ల్లులు కురుస్తుంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ (IMD) పేర్కొన్న‌ది.

Toss for the 1st IND vs NZ Test has been delayed due to rain

 

రేపు కూడా బెంగుళూరులో మేఘావృతం అయి ఉంటుంద‌ని వెద‌ర్ డిపార్ట్‌మెంట్ వెల్ల‌డించింది. మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్ప‌డం క‌ష్టంగా ఉంది. ఇటీవ‌లే బంగ్లాదేశ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో భార‌త్ కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే.

Heavy rain around M Chinnaswamy Stadium

 

ఇక శ్రీలంక‌లో టెస్టు సిరీస్ ఆడిన కివీస్ దాంట్లో ఓట‌మి పాలైంది. న్యూజిలాండ్ బౌల‌ర్ టిమ్ సౌథీ ఇటీవ‌ల కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాడు. లంక సిరీస్‌లో ఓట‌మి త‌ర్వాత అత‌ను వైదొలిగాడు. ప్ర‌స్తుత సిరీస్‌కు టామ్ లాథ‌మ్ కెప్టెన్సీ ప‌గ్గాలు చేప‌ట్టాడు.అయితే 400 వికెట్ల‌కు 15 వికెట్ల దూరంలో ఉన్న టిమ్ సౌథీ తుది జ‌ట్టులో స్థానం సంపాదిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

(The above story first appeared on LatestLY on Oct 16, 2024 10:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).