భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును నేడు ప్రకటించింది. టెంబా బవుమా జట్టును ముందుండి నడిపించనున్నాడు. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, రైట్ ఆర్మ్ పేసర్ గెరాల్డ్ కొయెట్జీ జట్టులో చోటు దక్కించుకున్నారు.
అలాగే అరివీర భయంకర పేసర్లు కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్ కొయెట్జీ జట్టులో ఉన్నారు. వీరితో పాటు ఆల్‌రౌండర్ మార్కో జన్సెన్.. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్ సౌతాఫ్రికన్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు. అక్టోబర్ 7న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో సౌతాఫ్రికా వరల్డ్‌కప్ జర్నీని ప్రారంభంకానుంది. అంతకుముందు వీరు సెప్టెంబర్ 27న ఆఫ్ఘనిస్తాన్‌తో, అక్టోబర్ 2న న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడతారు.
వన్డే వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్ కొయెట్జీ, మార్కో జన్సెన్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్
Here's Team
Here are the 1️⃣5️⃣ men who have been tasked with the ICC Men's @cricketworldcup duties 📝 🇿🇦
Let's back our boys 💪🏏 #CWC23 #ProteasSquadAnnouncement pic.twitter.com/zgvQZCVi7i
— Proteas Men (@ProteasMenCSA) September 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)