India Cricket Team during National Anthem (Photo Credit: Twitter/@ImTanujSingh)

New Delhi, SEP 22: భార‌త జ‌ట్టు మ‌ళ్లీ వ‌న్డేల్లో నంబ‌ర్ 1(World N0 1) ర్యాంక్ ద‌క్కించుకుంది. ఆస్ట్రేలియా(Australia)తో జ‌రిగిన‌ తొలి వ‌న్డేలో అద్భుత‌ విజ‌యం సాధించిన టీమిండియా 116 పాయింట్ల‌తో అగ్ర‌స్థానం ద‌క్కించుకుంది. 115 పాయింట్లు ఉన్న‌ పాకిస్థాన్‌(Pakistan) రెండో స్థానానికి ప‌డిపోయింది. ఈమ్యాచ్‌లో చివ‌రిదాకా పోరాడి ఓడిన ఆసీస్ మూడో స్థానంతో స‌రిపెట్టుకుంది. ఈరోజు మొహాలీ స్టేడియం(Mohali Stadium)లో ఉత్కంఠ పోరులో రాహుల్ సేన‌ కంగారూల‌ను 5 వికెట్ల తేడాతోచిత్తు చేసింది. దాంతో, ఈ స్టేడియంలో ఆసీస్‌పై 13 ఏళ్ల త‌ర్వాత తొలిసారి గెలుపొందింది.

 

ఆస్ట్రేలియా నిర్ధేశించిన 277 ఛేద‌న‌లో ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(74 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్(71 77 బంతుల్లో 10 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. ఆ త‌ర్వాత కెప్టెన్ రాహుల్(56 నాటౌట్), ఆసీస్‌పై వ‌రుస‌గా మూడుసార్లు గోల్డెన్ డ‌క్ అయిన‌ సూర్య‌కుమార్ యాద‌వ్(50) కీల‌క ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టును గెలుపు వాకిట నిలిపారు. ఈ విజ‌యంతో భార‌త్ మూడు వ‌న్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.