
Credits: Twitter
Newdelhi, Dec 4: బంగ్లాదేశ్ తో (Bangladesh) వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా (Team India) పేసర్ మహ్మద్ షమీ (Shami) గాయపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో షమీ స్థానాన్ని ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) తో భర్తీ చేస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. షమీ దూరం కావడంతో సీనియర్ సెలెక్షన్ కమిటీ ఉమ్రాన్ మాలిక్ ను వన్డే సిరీస్ కు ఎంపిక చేసిందని తెలిపింది.
మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. ఆదివారం తొలి వన్డే జరగనుంది. అయితే భారత్ లో ఉన్నప్పుడే ప్రాక్టీసు చేస్తుండగా షమీ భుజం గాయానికి గురయ్యాడు. అతడు జట్టుతో పాటు బంగ్లాదేశ్ వెళ్లలేదు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న షమీ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం ఇచ్చారు.