భారత-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. బుమ్రా (19), కుల్దీప్ (27) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. టీమిండియా బ్యాటింగ్ సంచలనం యశస్వీ జైస్వాల్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వీరవిహారం చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్.. బషీర్ వేసిన ఓ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఒక జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్.. ఇంగ్లండ్ పై 74 ఇన్నింగ్స్‌లలో 25 టెస్టులు కొట్టగా తాజాగా యశస్వీ.. అదే ఇంగ్లీష్ టీమ్‌పై 26 సిక్సర్లు బాదాడు. సౌతాఫ్రికాపై రోహిత్ శర్మకు 20 ఇన్నింగ్స్‌లలో 22 సిక్సర్లున్నాయి. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా యశస్వీ జైస్వాల్ రికార్డు, 16 ఇన్నింగ్స్‌లలో ఘనత..
Here's Video
Yashasvi Jaiswal now has the MOST Test sixes by Indians against an opponent.
26* - Yashasvi Jaiswal v ENG
25 - Sachin Tendulkar v AUS
22 - Rohit Sharma v SA
21 - Kapil Dev v ENG
21 - Rishabh Pant v ENG
And this is only his first series against England!pic.twitter.com/T2wIK8KMuP
— Kausthub Gudipati (@kaustats) March 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)