ఈ హెడ్‌లైన్ చూసి.. ఏటింది, క్రికిట్ ప్రపంచకప్ సినిమా మళ్ళీ ప్రధానమంత్రి అంటూ తలాతోకా లేదు అనుకుంటున్నారా? అక్కడే మీరు తొక్కమీద కాలేశారు. ప్రతీదానికి సంబంధం ఉంది. 'ఈ నేచర్‌లో ఎక్కడో జరిగిన మూమెంట్ ఇంకెక్కడో జరిగే మూమెంట్‌ను డిసైడ్ చేస్తుంది. ఎవ్రీ థింగ్ ఈజ్ ఇంటర్లింక్‌డ్' అనే డైలాగ్ ఎప్పుడైనా విన్నారా? కరెక్ట్! సుకుమార్ (Sukumar B) దర్శకత్వంలో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్‌టీఆర్ (NTR) చెప్పే డైలాగ్ ఇది. అంటే ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు మరో సంఘటనతో ముడిపడి ఉంటుంది అని అర్థం వస్తుంది.

ఇప్పుడు సుకుమార్‌కు, ప్రపంచకప్‌కు ఏంటి సంబంధం అంటే. నాన్నకు ప్రేమకు సినిమాలో సుకుమార్ చెప్పినట్లుగానే పాకిస్థాన్ క్రికిట్ జట్టు (Pakisthan Cricket Team) విషయంలో అచ్ఛం అలాంటి విచిత్రమే ఒకటి చేసుకుంది. 1992 ప్రపంచకప్‌లో  పాకిస్థాన్ ఎలాంటి ప్రదర్శన చేసిందో, యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు 2019 (ICC Cricket World Cup 2019)లో ఆ జట్టు ప్రదర్శన అలాగే ఉంది.  ఎంతలా ఉందంటే ఒకసారి కింది లెక్కలు చూడండి.

ఇంకా చెప్పాలంటే 1992 ప్రపంచ కప్‌లో అప్పటివరకూ ఓటమెరుగని న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది, ఇప్పుడు 2019లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఆనాటి మ్యాచ్ లో ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సెంచరీ చేశాడు, ఇక్కడ కూడా ఓ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సెంచరీ చేశాడు. ఆనాటి ఆరవ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అమిర్ సోహైల్, ఇప్పటి ఆరవ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హరీస్ సోహైల్ . 1992 టోర్నీలో లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు, 2019 లోనూ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1992 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా, ఇండియా జట్లు విజేతలుగా ఉంటే 2019 లోనూ అవే జట్లు విజేతలుగా ఉన్నాయి. ఇలా ఎన్నని చెప్పాలి, ఎంతని చెప్పాలి.

దీనిని బట్టి ఏం తెలిసింది? ఎప్పుడో, ఎక్కడో జరిగిన మూమెంట్‌కి , ఇంకో చోట జరిగిన మూమెంట్‌కు ఇంటర్ లింక్ అయి ఉంది కదా. ఈ లెక్కన సుకుమార్ చెప్పింది నిజమైంది కదా. ఇంత జ్ఞానం ఉన్న సుకుమార్ మామూలు జ్ఞాని కాదు కాలజ్ఞాని, ఆయనకి అభినవ వీరబ్రహ్మం అని బిరుదిచ్చేద్దాం.

సరే ఇప్పుడు ప్రధానమంత్రి విషయానికి వద్దాం. పాకిస్థాన్ స్టోరీ అలా కంటిన్యూ అవుతూపోతే, 1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఆ దేశ ప్రధానిగా ఉన్నారు. ఈ లెక్కన ప్రస్తుత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న సర్ఫరాజ్ ఖాన్ 2045లో పాకిస్థాన్ ప్రధానమంత్రి అవ్వాలి అంతేగా? ప్చ్.. ఇదంతా  గమనిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ఎన్ని కలలు కంటున్నాడో.. ఇదంతా గమనిస్తున్న, ఏ ఊహాలోకంలో విహరిస్తున్నాడో కదా? చిన్ని చిన్ని ఆశ చిన్నవాడి ఆశ. మరి ఆ ఆశ నెరవేరుతుందో ముందున్న కాలం చెప్తుంది సమాధానం.