రాష్ట్రీయం

Telangana Group-1 Exams Update: గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్, మరో ఆరు రోజుల్లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, నోటిఫికేష‌న్ల‌పై ప‌లువురు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను కొట్టివేసిన హైకోర్టు

Hazarath Reddy

తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు.

Telangana: వీడియో ఇదిగో, మద్యం మత్తులో ఓ యువకుడిని దారుణంగా కొట్టిన యువకులు, సిద్దిపేటలో దారుణ ఘటన

Hazarath Reddy

Telangana: వీడియో ఇదిగో, ఒక్కగానొక్క కొడుకు పిడికెడు అన్నం కూడా పెట్టడం లేదంటూ అధికారి ముందు ఏడ్చిన కన్నతల్లి, పింఛన్ కూడా లాక్కుంటున్నారని ఆవేదన

Hazarath Reddy

కోదాడ గాంధీనగర్ వాసి సోమపంగు వెంకమ్మ స్థానిక మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి, పదవీ విరమణ పొందింది. కాగా తనకున్న ఒక్కగానొక్క కొడుకు, కోడలు తనని చూడకుండా, తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోదాడ RDO ఆఫీసులో విలపించింది

New Liquor Policy in AP: బాబోయ్.. విశాఖలో 155 మద్యం షాపులకు అప్లికేషన్లు వేసిన ఢిల్లీ వ్యాపారి, దరఖాస్తు రుసుమే రూ.3 కోట్లు, ఇంతకీ ఆయనకు దక్కిన షాపులు ఎన్నంటే..

Hazarath Reddy

విశాఖ జిల్లాలో వైన్‌షాపుల కోసం ఒకవైపు కూటమి ప్రజాప్రతినిధులు, సిండికేట్లు పెద్ద ఎత్తున పోటీ పడగా..తాజాగా ఢిల్లీకి చెందిన లిక్కర్‌ వ్యాపారి కూడా విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ఏకంగా 155 వైన్‌షాపులకు దరఖాస్తులు చేశాడు.

Advertisement

New Liquor Policy in AP: నేటితో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూత, రేపటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు అందుబాటులోకి, రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు లైసెన్స్ మంజూరు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు నేటితో మూతపడనున్నాయి. రేపటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా... మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు

Hyderabad Horror: గచ్చిబౌలిలో అర్థరాత్రి రెచ్చిపోయిన కామాంధులు, డ్యూటీ నుంచి ఇంటికి వెళుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని ఆటోలోకి లాక్కెళ్లి ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం

Hazarath Reddy

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు

Rudra

దసరా సెలవులు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు.

Centipede Found in Biryani: భువనగిరిలో షాకింగ్ ఘటన.. వివేరా హోటల్లో సర్వ్ చేసిన బిర్యానీలో కనిపించిన జెర్రీ.. వైరల్ వీడియో

Rudra

భువనగిరిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రముఖ వివేరా హోటల్లో సర్వ్ చేసిన బిర్యానీలో జెర్రీ కనిపించింది. దీంతో కస్టమర్ కంగుతిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి తెగబడ్డ ఇద్దరు యువకులు

Rudra

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు ఆటోలో అత్యాచారానికి తెగబడ్డారు.

Jagtial Horror: 'మంత్రాలు చేసేవాళ్లని చంపబోతున్నాం' అంటూ జగిత్యాల జిల్లాలో వెలిసిన వాల్ పోస్టర్లు.. వీడియో ఇదిగో..!

Rudra

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. మంత్రగాళ్లను హెచ్చరిస్తూ ఓ శిలాఫలకానికి వాల్ పోస్టర్లు కనిపించడంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు.

Goddess Saraswathi Idol Vandalized: ఏపీలోని ప్రత్తిపాడులో ఘోరం.. విద్యార్థులు పూజించే సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆకతాయిలు (వీడియో)

Rudra

ఏపీలోని ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి చొరబడిన కొందరు దుండగులు స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు పూజించే సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు తుఫాన్‌ గండం పొంచివున్నట్టు వెల్లడించింది.

Advertisement

Muthyalamma Temple Idol Vandalised Video: వీడియో ఇదిగో, ముత్యాలమ్మ అమ్మవారిని కాలితో తన్నుతూ ధ్వంసం చేసిన అగంతకుడు, సీసీటీవీ పుటేజీ వెలుగులోకి..

Hazarath Reddy

సికింద్రాబాద్ (Secunderabad) మొండా మార్కెట్ (Monda Market) పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోని (Muthyalamma Idol Vandalized) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది

Viral Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ కిందపడిన మహిళ, చాకచక్యంగా ఆమెను కాపాడిన ఆర్పీఎఫ్​ ​ కానిస్టేబుళ్లు

Hazarath Reddy

సికింద్రాబాద్​ స్టేషన్​లో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ కిందపడింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్​ ​ కానిస్టేబుళ్లు రాజశేఖర్, విశ్వజీత్ అమెను గమనించి చాకచక్యంగా కాపాడారు. ఇదంతా సీసీటీవీలో రికార్డయింది.

New Liquor Policy in AP: ఏపీలో ముగిసిన మద్యం లాటరీ ప్రక్రియ, లిక్కర్ షాపులను దక్కించుకున్న మహిళలు, అక్టోబర్ 16 నుంచి కొత్త షాప్‌లో మద్యం అమ్మకాలు

Hazarath Reddy

ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 89 వేల 882 దరఖాస్తులు వచ్చాయి. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభమయింది. దరఖాస్తు రుసుముగా ప్రభుత్వానికి రూ.1,797. 64 కోట్ల ఆదాయం సమకూరింది

Head Constable Dies by Suicide: మహబూబాబాద్‌ కలెక్టరేట్ లో విషాదం.. గన్‌ తో కాల్చుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. వీడియో వైరల్

Rudra

మహబూబాబాద్‌ లో విషాదం నెలకొంది. కలెక్టరేట్‌ లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ గుండెబోయిన శ్రీనివాస్‌ (56) గన్‌ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

KTR Consoles Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన కేటీఆర్, గుండెపోటుతో ఆయన కూతురు కన్నుమూత

Vikas M

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ లోని రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనను ఓదార్చారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల వయసులో ఆమె హఠాన్మరణానికి గురయ్యారు

Chiranjeevi Meet CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి...వరద సాయం చెక్కు చంద్రబాబుకు అందజేత...

sajaya

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు.

Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం, జలమయమైన రోడ్లు, పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్

Hazarath Reddy

హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్ గూడ, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది

Rain In Tirumala: తిరుమలలో దంచి కొడుతున్న వర్షం, తెల్లవారుజాము 4 గంట నుంచి ఎడతెరిపి లేకుండా వాన, వీడియో ఇదిగో..

Hazarath Reddy

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ వేకువజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ తెల్లవారుజాము 4 గంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమాడ వీధుల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి.

Advertisement
Advertisement