Supreme Court. (Photo Credits: PTI)

Vjy, July 11: అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను డిసెంబర్ లో విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈమేరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఇతర రాజ్యాంగ ధర్మాసనాల కేసులు విచారించాల్సి ఉందని, నవంబర్ వరకూ ఈ కేసుల విచారణ జరుగుతుందని చెప్పింది.

రాజ్యాంగ ధర్మాసనం కేసులన్న నేపథ్యంలో.. ఈ కేసుకు త్వరగా సమయం కేటాయించలేమని పేర్కొంది. ఈలోపు ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తి చేయాలని మంగళవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం సూచించింది.రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యర్థనను మన్నించలేమని పేర్కొంది.

వీడియో ఇదిగో, విలుకాడుగా మారిన జగన్, గురి చూసి బాణం వదిలితే సరిగ్గా సెంటర్లో దిగింది

ఆరు నెలల్లో అమరావతి రాజధానిని నిర్మించాలని హైకోర్ట్ జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో ఈ కేసు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ చేశారు. దీంతో ఈ కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిల బెంచ్ కు బదిలీ అయింది.

కాగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌ ద్వారా అత్యున్నత న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని.. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలని.. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధమని.. అన్నింటికీ మించి తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.

సిగ్గుందా పవన్, చంద్రబాబు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేస్తావా, జనసేనానిపై విరుచుకుపడిన పేర్ని నాని

రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది. అలాగే.. ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు కొందరు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా.. రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలన్నీ సూచించాయని ప్రభుత్వం వాదిస్తోంది. .

ఏపీ ప్రభుత్వం చెబుతోంది ఏమంటే.. 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం. రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం రూ. 2000 కోట్లు పూర్తవుతుంది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు. వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది , ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది.