Vijayawada, July 12: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Dhiraj Singh Takur) బదిలీ అయ్యారు. ఆయనను లఢక్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Dhiraj Singh Takur) గత ఏడాది జూలై 24న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ధీరజ్ సింగ్ బదిలీ కావడంతో ఏపీ కొత్త చీఫ్ జస్టిస్ ఎవరనేది తేలాల్సి ఉంది. ఇదిలావుంటే మరోవైపు ప్రస్తుతం ఏపీలో కూడా బదిలీల పర్వం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి పలువురు అధికారులు బదిలీ అవుతున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న కారణంతో పలు శాఖల్లో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది.
అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని పలువురు అధికారులను బదిలీ చేసింది. శుక్రవారం సైతం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను లఢక్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది.