Vijayawada, SEP 04: విజయవాడలో దారుణ పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Shah) తెలిపారు. కాగా, అమిత్ షా ట్విట్టర్ వేదికగా.. ‘విజయవాడ ముంపు (Vijayawada Flood), వరదలపై కేంద్ర కమిటీ నియామకం. కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ నేతృత్వంలో నిపుణుల కమిటీ నియామకం జరుగుతుంది.
Here's Tweet
The Modi government is closely monitoring the ongoing flood situation in Andhra Pradesh.
The MHA today constituted a central team of experts, led by the Additional Secretary (Disaster Management), MHA. The team will visit the flood-affected areas for an on-the-spot assessment…
— Amit Shah (@AmitShah) September 4, 2024
ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో ఈ కమిటీ పర్యటిస్తుంది. వరద నష్టం, వరద నివారణ, డ్యామ్‌ల భద్రతపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం కమిటీ ఏపీకి రానున్నట్టు సమాచారం.
మరోవైపు నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత 30ఏళ్లలో బుడమేరు ఎన్నడూ ఇంత ఉదృతంగా ప్రవహించలేదని ముంపు ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు. బుడమేరు వరద ఉధృతి కారణంగా పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వరద నీరు చోచ్చుకు వచ్చింది. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరిపిరాలలో అత్యంత ప్రమాదకర స్థితిలో బుడమేరు ప్రవాహం కొనసాగుతుంది. Central Govt Committee