Contaminated Water in Kurnool: కర్నూలు జిల్లాలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వందలమంది, పలువురి పరిస్థితి విషమం, ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వెళుతున్న గోరుకల్లు వాసులు

కర్నూలు జిల్లాలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందారు. మరో వందమందికిపైగా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కలుషిత నీరు (Contaminated Water in Kurnool) తాగి గ్రామస్తులు చనిపోతుండడంతో (Four people have died) గోరుకల్లు వాసులు ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు.

Contaminated Water in Kurnool: కర్నూలు జిల్లాలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వందలమంది, పలువురి పరిస్థితి విషమం, ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వెళుతున్న గోరుకల్లు వాసులు
Image used for representational purposes only (Photo Credits: Pixabay)

Kurnool, April 7: కర్నూలు జిల్లాలో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందారు. మరో వందమందికిపైగా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కలుషిత నీరు (Contaminated Water in Kurnool) తాగి గ్రామస్తులు చనిపోతుండడంతో (Four people have died) గోరుకల్లు వాసులు ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు.

పాణ్యం మండలంలో గోరుకల్లులో (Gorukallu) మూడు రోజుల నుంచి కలుషిత నీరుతాగి 30 మందికిపైగా అస్వస్థతకులోనయ్యారు. వారిలో కిట్టు, హుస్సేన్, మద్దమ్మ చనిపోయారు. మరికొందరు అస్వస్థతకు గురై అస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

గోరుకల్లును నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనకుమారి, డీఎంహెచ్‌వోతోపాటు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సందర్శించారు. కొత్త డ్రైన్, పైపులైన్లు వేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మురుగునీరు.. తాగునీటిలో కలిసి కలుషితమైందని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గౌరు చరితారెడ్డి అన్నారు.

ఏపీలో కరోనా కల్లోలం, ఒక్కరోజే 11 మంది మృతి, గడచిన 24 గంటల్లో 2,331 కరోనా కేసులు నమోదు, కృష్ణా జిల్లాలో 327, విశాఖ జిల్లాలో 298, చిత్తూరు జిల్లాలో 296, అనంతపురం జిల్లాలో 202 కేసులు నమోదు

జిల్లాలోని ఆదోని, పాణ్యంలో (Gorukallu Village in Panyam) అతిసార ప్రబలింది. ఆదోని, నంద్యాల ఆసుపత్రుల్లో అతిసార బాధితులకు చికిత్స పొందుతున్నారు. రోగులతో నంద్యాల, ఆదోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పాణ్యం మండలం గోరుకల్లులో అతిసార ప్రబలడంతో నీటి సరఫరా నిలిపివేశారు. నంద్యాల నుంచి గోరుకల్లుకు ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటిని సరఫరా చేయిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Apr 07, 2021 06:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).