HYD Water Supply Row: అలర్ట్ టైం..ఏప్రిల్ 1న హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్, పైపులైన్‌ విస్తరణ పనుల్లో భాగంగా వాటర్ నిలిపివేత, నీటిని పొదుపుగా వాడుకోవాలని వాటర్‌ బోర్డు అధికారులు సూచన
Water supply | Representational Image | (Photo Credits: Pixabay)

Hyderabad, Mar 30: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్‌ 1న నీటి సరఫరా బంద్‌ చేయనున్నట్లు (No water supply to some parts of Hyderabad) వాటర్‌బోర్డు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్‌-1కు చెందిన 1200ఎంఎం డయా మెయిన్‌ పైపులైన్‌ జంక్షన్‌ పనులు, చంద్రాయణగుట్ట నుంచి కందికల్‌ గేట్‌ క్రాస్‌ రోడ్డు వరకు పైపులైన్‌ విస్తరణ పనులు చేపడుతున్నారు. దీంతో ఏప్రిల్‌ 1న ఉదయం ఆరు గంటల నుంచి 24గంటల పాటు పనులు కొనసాగుతాయి.

వీటి కారణంగా ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ డివిజన్‌-1 పరిధిలోని మీరాలం రిజర్వాయర్‌, కిషన్‌బాగ్‌ ప్రాంతం, ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ డివిజన్‌-2 పరిధిలోని అల్జుబైల్‌ కాలనీ, అలియా బాద్‌ రిజర్వాయర్‌ ప్రాంతం, బాలాపూర్‌ రిజర్వాయర్‌ ప్రాంతాలకు 24గంటల పాటు నీటి సరఫరా (water supply) నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని వాటర్‌ బోర్డు అధికారులు (hyderabad metropolitan water supply) సూచించారు.

కరోనా దృష్ట్యా రైతులు సాగుచేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం, రాష్ట్రవ్యాప్తంగా 6,408 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ఇదిలా ఉంటే వాటర్‌బోర్డు సమస్యల పుట్టగా మారింది. రోజు రోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. బోర్డు కస్టమర్‌ కేర్‌ నం బర్‌కు 155313కు ఫోన్ల ద్వారా చేయడంతోపాటు ట్విటర్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ద్వారా కూడా నగరవాసులు ఫిర్యాదులు చేస్తున్నారు. తాగునీటి సరఫరా సక్రమంగా లేదని, నీళ్లు రావడం లేదని రెండేండ్ల క్రితం వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యధిక ఫిర్యాదులు వచ్చేవని, ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టాయి.

వేడెక్కిన సాగర్ ఉప ఎన్నిక, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌, కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డి, ఇంకా అభ్యర్థిని ప్రకటించని బీజేపీ

కలుషిత నీటి సరఫరా ఫిర్యాదులు అధికమయ్యాయి. రోజువారీ వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో 32 శాతం ఆలస్యమవుతోంది. సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 500, వర్షాకాలంలో వెయ్యికిపైగా ఫిర్యాదులు వస్తున్నాయి. నారాయణగూడ, ఆస్మాన్‌గూడ, ఆసి్‌ఫనగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌ డివిజన్ల పరిధిలో తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక మూసీనది పరీవాహకాలు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. ఫలితంగా భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. ఆ నీటిని తాగడానికి కాదు కదా.. కనీస అవసరాలకు, వ్యవసాయానికి కూడా వాడుకోకూడని స్థాయిలో కలుషితాలు పెరిగిపోయాయి.