Nagarjuna Sagar By-Poll 2021: వేడెక్కిన సాగర్ ఉప ఎన్నిక, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌, కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డి, ఇంకా అభ్యర్థిని ప్రకటించని బీజేపీ
nomula bhagath and Late TRS MLA Nomula Narsimhaiah (Photo-Twitter)

Nagarjuna Sagar, Mar 29: నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక (Nagarjuna Sagar By-Poll 2021) అనివార్యమైంది. నాగర్జున సాగర్‌ ఉప ఎన్నికకు టీఆర్‌​ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. నోముల నర్సింహయ్య (Nomula Narsimhaiah) కుమారుడు భగత్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది.

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ నోముల భగత్‌కు బీ-ఫాం అందజేశారు. భగత్‌ (nomula bhagath) రేపు ఉదయం నిడమనూరులో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ప్రకటించింది. ఇక బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. కాగా ఏప్రిల్‌ 17న నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

Here's TRS Party Update

టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించటంతో బీజేపీ అలెర్ట్ అయింది. టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అసంతృప్తులు తమ పార్టీలోకి రాకుంటే సొంత పార్టీ నుంచే బీజేపీ అభ్యర్థిని ప్రకటించనుంది. టీఆర్ఎస్ బీసీ సామాజివర్గానికి టికెట్ కేటాయించటంతో బీజేపీ ఎస్టీ వర్గానికి కేటాయించే అవకాశం ఉంది. సాగర్‌లో 40 వేలకు పైగా ఎస్టీల ఓట్లు ఉన్నాయి. బీజేపీ టికెట్ రేసులో రవి నాయక్, అంజయ్య యాదవ్, నివేదితారెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులున్నారు. అయితే వీరిలో ఇప్పటికే నివేదితా రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అధిష్టానం ఫైనల్ చేయకుండానే ఆమె నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది.

nommula bagath profile

పేరు: నోముల భగత్ కుమార్

తండ్రి: దివంతగ నోముల నర్సింహయ్య

తల్లి: నోముల లక్ష్మి

భార్య: నోముల భవానీ

పిల్లలు: కుమారుడు, కుమార్తె

పుట్టిన తేది: అక్టోబర్ 10, 1984

చదువు: BE, MBA, LLB, LLM

ఉద్యోగ అర్హతలు: సత్యం టెక్నాలజీస్ లిమిటెడ్ లో జూనియర్ ఇంజనీర్, విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్ లో మేనేజర్ గా బాధ్యతలు, ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా విధులు

రాజకీయ అనుభవం: 2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఆర్గనైజర్ సివిల్ ప్రొఫైల్: నోముల ఎన్.ఎల్ ఫౌండేషన్ చైర్మన్

సాగర్‌ బీజేపీ అభ్యర్థిగా ‘పానుగోతు రవికుమార్’‌

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్‌ పానుగోతు రవికుమార్‌ పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సోమవారం రాత్రి అధికారిక ప్రకటన జారీ చేశారు. అంతకుముందు అభ్యర్థి ఖరారు ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. కె.నివేదితారెడ్డి, అంజయ్య యాదవ్, ఇంద్రసేనారెడ్డి టికెట్‌ ఆశించినప్పటికీ ఎక్కువమంది రాజకీయ, సామాజిక కోణాల ఆధారంగా ఎస్టీ వర్గానికి చెందిన రవి కుమార్‌ వైపే మొగ్గు చూపారు.