Vijayawada, June 01: కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగా విస్తరిస్తుండడంతో విశాఖ వాతావరణ శాఖాధికారులు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు తీపి కబురును అందజేశారు. మరికొన్ని గంటల్లో రుతుపవనాలు రాయలసీమ(Rayalaseema) లోకి ప్రవేశించి రేపటి నుంచి వర్షాలు కురుస్తాయని, ఈ వర్షాలు రెండు, మూడు రోజుల్లో మరింతగా విస్తరించేందుకు అనుకూల అవకాశాలున్నాయని వెల్లడించారు. దక్షిణ కోస్తాలో వడగాలులు, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అన్నీ కుదిరితే జూన్ మొదటి వారంలోనే రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భావిస్తున్నారు. ఉత్తరకోస్తా(North Costa) లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షము (Rains) లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వెల్లడించారు.
దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని వివరించారు. గంటకు 30-40 కి మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాయలసీమలో ఆదివారం తేలికపాటినుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు, ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు పడుతాయని వివరించారు.