Pawan Kalyan(Twitter)

Vijayawada, Sep 20: తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ (Tirupati Laddu) ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌ల‌పారన్న వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్' వేదిక‌గా ‘హిందూ ఐటీ సెల్’ సంస్థ చేసిన ఫిర్యాదుపై ఆయ‌న రిప్లై ఇచ్చారు. లడ్డూ అంశంపై తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు పేర్కొన్న ప‌వ‌న్‌.. వైసీపీ హ‌యాంలో ప‌నిచేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలని అన్నారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌ల‌ప‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. ఇది అంద‌రి మ‌నోభావాల‌నూ దెబ్బ‌తీసింద‌న్నారు.

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం, ఆధారాలు ఇవిగో అంటూ బయటపెట్టిన టీడీపీ, ఖండించిన వైసీపీ

Here is the tweet:

సనాతన ధర్మ రక్షణ బోర్డు

ఈక్రమంలో పవన్ కీలక డిమాండ్ తెరమీదకు తీసుకొచ్చారు. దేశంలోని దేవాల‌యాలకు సంబంధించిన అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించేలా జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ నొక్కి చెప్పారు. సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అప‌విత్రం చేయ‌కుండా ఉండేలా అంద‌రూ క‌లిసిరావాలని ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపునిచ్చారు.

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం, టీటీడీ ఈవో శ్యామలరావు కీలక ప్రకటన, భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేద్దామంటూ సీఎం చంద్రబాబుకు వైసీపీ సవాల్