Vijayawada Horror: రొయ్యల బిర్యానీ ఇప్పించలేదని అన్నను చంపిన తమ్ముడు.. విజయవాడలో ఘోరం

విజయవాడలో ఘోరం జరిగింది. తన భార్యకు రొయ్యల బిర్యానీ ఇప్పించలేదని ఓ తమ్ముడు తన అన్ననే చంపేశాడు. ఈ దారుణ ఘటన గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీలో సోమవారం జరిగింది.

Vijayawada Horror: రొయ్యల బిర్యానీ ఇప్పించలేదని అన్నను చంపిన తమ్ముడు.. విజయవాడలో ఘోరం
Representative Image (Photo Credit- PTI)

Vijayawada, Aug 27: విజయవాడలో (Vijayawada) ఘోరం జరిగింది. తన భార్యకు రొయ్యల బిర్యానీ (Prawns Biryani) ఇప్పించలేదని ఓ తమ్ముడు తన అన్ననే చంపేశాడు. ఈ దారుణ ఘటన గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీలో సోమవారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే,  సాయిపురం కాలనీలో గాలి రాము, గాలి లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకే కాలనీలో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఇద్దరికి పెళ్లి అయింది.అయితే, సోమవారంరోజు ఉదయం అన్న రాము దగ్గరికి తమ్ముడు లక్ష్మారెడ్డి తన భార్యతో సహా వెళ్లాడు. ఈ క్రమంలో తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని ఇప్పించమని అడిగాడు.

మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు

ఇద్దరి మధ్య గొడవ

ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ అయింది. గొడవ పెద్దదవ్వడంతో పరిస్థితి చేజారింది. దీంతో కోపంతో ఊగిపోయిన లక్ష్మారెడ్డి  కిటికీ చెక్కతో అన్న రాముపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అన్న రాము అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు లక్ష్మారెడ్డిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్‌ అండ్ డ్రైవ్ వీడియో

(The above story first appeared on LatestLY on Aug 27, 2024 08:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).