Vijayawada, AUG 11: ఏపీ రైతుల పట్ల చంద్రబాబు (CM Chandra Babu) నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ధ్వజమెత్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. రైతు బాగుంటేనే .. రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబుకు ఆదివారం ఎక్స్ వేదిక (X platform) ద్వారా సూచించారు. 2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదు. దీనివల్ల రైతులకు ఉచిత పంటల బీమా (Crop Insurance) చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్-మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నాం. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారంపడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశామని గుర్తు చేశారు.
.@ncbn … 2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదు. దీనివల్ల రైతులకు ఉచిత పంటలబీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్-మే నెలలో చెల్లించి…
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 11, 2024
రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం(Premium) చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదలచేస్తుంది. ఇది జరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూలేని విధంగా రూ.7,802 కోట్లు అందించి అండగా నిలిచి, దేశంలో పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు.
ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటల దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా (Raitu Barosa) సొమ్ము ఏటా రూ.20వేలు ఇస్తామని సూపర్ సిక్స్ ( Super Six) హామీల్లో పేర్కొన్నారు. మీరిచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తికావొస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా లేదని జగన్ ఆరోపించారు. మా ప్రభుత్వ హయాంలో కోవిడ్‌తో ప్రపంచ ఆర్థికవ్యవస్థలన్నీ కుదేలైనా క్రమం తప్పకుండా రైతులకు రైతు భరోసా అందించాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్లో రైతు భరోసా చెల్లించాం. ఈ విధంగా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు పెట్టుబడి సహాయం చేశామని పేర్కొన్నారు.