Hyderabad, Aug 13: తుంగభద్ర డ్యామ్ లో ఓ గేటు ఇటీవల కొట్టుకుపోవడం ఆ డ్యాం (Dam) భద్రతపై అనుమానాలను రేకెత్తించింది. గేటు కొట్టుకుపోవడంతో భారీ ఎత్తున నీరు వృథాగా పోయింది. వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. నీటి ప్రవాహం పెరుగడంతో కర్నూలు జిల్లావాసులు భయంగా రోజులు గడిపారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని డ్యామ్ ల భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గద్వాల్ సమీపంలోని జూరాల డ్యామ్ (Jurala Dam) గేట్లలో పలుచోట్ల లీకేజీలు కనిపిస్తున్నాయి. ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది. 2021లో ప్రభుత్వం మరమ్మతుల కోసం కొన్ని నిధులను విడుదల చేసింది. మొత్తం 62 గేట్లలో ఐదింటికి మరమ్మతులు జరిపినట్లు అధికారులు తెలిపారు. నిధులు సకాలంలో విడుదల కాకపోవడమే దీనికి కారణంగా చెప్పారు.
పాట్నా విమానాశ్రయంలోని రన్ వే పై ముంగిస, పాము మధ్య ఫైట్.. వీడియో వైరల్
గద్వాల: జూరాల గేట్లు మూసివేత..! pic.twitter.com/Tk7wUayfoG
— way2news_local (@Way2news_local) August 13, 2024
గేట్ల మూసివేత
ఎగువన వరద తగ్గడంతో ప్రస్తుతానికి జూరాల గేట్లను అధికారులు మూసివేశారు. దీంతో ఇప్పటికైతే, సమస్య లేదు. అయితే, వానాకాలం ఇంకా పూర్తికాకపోవడంతో వీలైనంత త్వరగా డ్యాం గేట్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు