Congress (Photo-Twitter)

New Delhi, JAN 07:   లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) కోసం కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఆదివారం సమన్వయకర్తలను ఏఐసీసీ (AICC) నియమించింది. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల సమన్వయకర్తగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ సమన్వయకర్తగా మంత్రి భట్టి విక్రమార్క, మల్కాజ్‌గిరి బాధ్యతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం-మహబూబాబాద్‌ సమన్వయకర్తగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.

 

వరంగల్‌కు కొండా సురేఖ, ఆదిలాబాద్‌కు సీతక్క, నల్గొండ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జూపల్లి కృష్ణారావు, మెదక్‌ దామోదర రాజనర్సింహ, నిజామాబాద్‌ జీవన్‌రెడ్డి, జహీరాబాద్‌ సుదర్శన్‌రెడ్డి, పెద్దపల్లి శ్రీధర్‌బాబు, కరీంనగర్‌ బాధ్యతలను పొన్నం ప్రభాకర్‌కు అప్పగించింది.