Credits: Twitter/ANI

Hyderabad, OCT 08: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో బీజేపీ (T-BJP) అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. టూర్లు, సభలు, సమావేశాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తెలంగాణ వచ్చారు. సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల శంఖారావం పూరించారు. ఇప్పుడు బీజేపీకి చెందిన మరో కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah Tour) తెలంగాణ పర్యటనకు అధికారికంగా షెడ్యూల్ ఖరారైంది. ఎల్లుండి ఒకేరోజు తెలంగాణలో రెండు సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఆదిలాబాద్ లో ఒక సభ, హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మరో సభ ఉంటాయి. మధ్యాహ్నం 3గంటలకు అమిత్ షా ఆదిలాబాద్ చేరుకుంటారు. 3 గంటల నుండి 4 వరకు ఆదిలాబాద్ జన గర్జన సభలో పాల్గొంటారు. 4.15 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ నుండి బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయనికి చేరుకుంటారు.

 

5గంటల 15 నిమిషాలకు శంషాబాద్ నోవోటల్ చేరుకుంటారు. 45 నిమిషాల పాటు షెడ్యూల్ రిజర్వ్ చేశారు బీజేపీ నేతలు. రాత్రి 6గంటల 15 నిమిషాలకు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో జనగర్జన సభలో అమిత్ షా పాల్గొంటారు. గంటపాటు సభా వేదికపై గడపనున్నారు అమిత్ షా. రాత్రి 7గంటల 30 నిమిషాలకు శంషాబాద్ నోవోటల్ చేరుకుంటారు. అనంతరం నాలుగు గంటల పాటు షెడ్యూల్ రిజర్వ్ లో ఉంచారు. ఈ సమయంలో బీజేపీ ముఖ్యనేతలు అమిత్ షాతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.