Zomato Delivery Boy Helped (PIC@ X)

Hyderabad, JAN 04: హైదరాబాద్ లో జొమాటోకు చెందిన ఓ డెలివరీ బాయ్ (Zomato Delivery Boy).. ఆర్డర్లను గుర్రంపై వెళ్లి డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Viral) అయింది. అతను గుర్రంపై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేయడానికి ఓ కారణం ఉంది. పెట్రోల్ కొరత వల్ల తలెత్తిన ఇబ్బందులు కారణంగా డెలివరీ బాయ్ గుర్రంపై వెళ్లి కస్టమర్లకు ఆర్డర్లు అందించాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హీట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యాజమానులు, డైవర్లు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.

 

దీంతో పెట్రోల్ సరఫరా నిలిచిపోయి హైదరాబాద్ లో పలుప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. కొన్ని బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా క్యూ కట్టారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. దీంతో ప్రతీరోజూ బైక్ పై వెళ్లి ఆర్డర్ డెలివరీ చేసే జొమాటో డెలివరీ బాయ్.. పెట్రోల్ కొరత కారణంగా ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అనుకున్న సమయానికి కస్టమర్ కు ఆర్డర్ డెలివరీ చేయాలన్న ఉద్దేశంతో గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ చేశాడు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ గా మారింది.

 

గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ చేసిన జొమాటో బాయ్ కి మజ్లిస్ బచావో తహ్రీక్ (MBT) పార్టీ ప్రతినిధి, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ అంజెద్ ఉల్లా ఖాన్ రూ.10వేలు సహాయం అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో గుర్రంపై వచ్చిన జొమాటో బాయ్ కు అంజెద్ ఉల్లా ఖాన్ పదివేల నగదు ఇవ్వడం చూడొచ్చు.