ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ వెలువడుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. మొత్తం 14 జడ్పీటీసీల్లో 04 ఏకగ్రీవం కాగా.. 10 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. 176 ఎంపీటీసీ స్థానాల్లో 50 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల కోసం జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. టీడీపీకి కంచుకోట లాంటి స్థానాల్లో కూడా వైసీపీ జెండా ఎగురవేసింది. టీడీపీ కంచుకోట ఆనందపురం జడ్పీటీసీ స్థానంను వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు దక్కించుకున్నాడు. 1983 జిల్లా పరిషత్ ఆవిర్భావం నుంచి ఆనందపురంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం చుక్కెదురైంది. వైసీపీ అభ్యర్థిని విజయం వరించింది. తొలిసారి 3576 ఓట్లతో వైసీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు జడ్పీటీసీగా ఎంపికయ్యారు. ఆనందపురంలో టీడీపీ కంచుకోట కుప్పకూలిపోయింది.
జిల్లాల వారిగా ఫలితాలు
విశాఖ జిల్లా ఆనందపురం జెడ్పీటీసీ వైసీపీ కైవసం
వైసీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు 3,755 ఓట్ల మెజార్టీతో గెలుపు
తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలో ఎంపీటీసీ ఫలితాలు
6 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ, ఒక్కోచోట గెలిచిన సీపీఎం, సీపీఐ
విజయనగరం జిల్లాలో మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలు
విజయనగరం జిల్లా (9 ఎంపీటీసీలు)- వైసీపీ: 6, టీడీపీ: 2, బీజేపీ: 1 స్థానంలో గెలుపు
శ్రీకాకుళం జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ 10, టీడీపీ 5 స్థానాల్లో గెలుపు
చిత్తూరు జిల్లాలో 8 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ 5, టీడీపీ 3 స్థానాల్లో విజయం
నెల్లూరు జిల్లాలో 4 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ 3, టీడీపీ 1 స్థానంలో గెలుపు
కడప జిల్లాలో 3 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది.
గుంటూరు జిల్లాలో 11 ఎంపీటీసీ స్థానాలు, వైసీపీ: 9, టీడీపీ: 2
గుంటూరు జిల్లాలో ఒక జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం
పశ్చిమగోదావరి జిల్లాలో 14 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 10, టీడీపీ: 3, జనసేన: 1 చోట గెలిచింది.
ప.గో. జిల్లాలో ఒక జెడ్పీటీసీ స్థానం వైసీపీ కైవసం
తూర్పుగోదావరి జిల్లాలో 20 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 8 టీడీపీ: 6 జనసేన: 3 సీపీఐ(ఎం): 2 స్వతంత్రులు: 1 స్థానంలో గెలిచారు.
కృష్ణా జిల్లాలో 8 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 6 టీడీపీ: 2 స్థానాల్లో విజయం సాధించారు.
కృష్ణా జిల్లాలో 3 జెడ్పీటీసీ స్థానాలు
రెండు వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ గెలిచింది.
కర్నూలు జిల్లాలో 7 ఎంపీటీసీ స్థానాలు
7 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు.
కర్నూలు జిల్లాలో ఒక జెడ్పీటీసీ స్థానం వైసీపీ కైవసం
అనంతపురం జిల్లాలో 16 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 10, టీడీపీ: 6 చోట్ల గెలిచారు.