
Dubbaka, May 28: సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) చేనేత వస్త్ర ఖ్యాతిలో మరో కలికితురాయి వచ్చి చేరింది. సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్రుడే దుబ్బాక చేనేత వస్ర్తాన్ని (Ikat Cloth) ధరించి మరింత ఖ్యాతిని విస్తరింపజేశాడు. వారం రోజుల పాటు రోజుకో రంగుతో తయారైన వస్ర్తాన్ని శ్రీరాముడికి అలంకరించేందుకు దుబ్బాక హైండ్ల్యూస్ కంపెనీ అర్డర్ ను అందుకున్నారు. లినెన్ ఇక్కత్ చేనేత వస్ర్తాన్ని (పింక్ కలర్) అయోధ్య రాముడికి ఆదివారం అలంకరించారని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బోడ శ్రీనివాస్ తెలిపారు.
