
కరీంనగర్, జనవరి 03: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కరీంనగర్ కోర్టులో చుక్కెదురైంది. బండి సంజయ్ కి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. నిన్న రాత్రి కోవిడ్ ఆంక్షలకు విరుద్ధంగా జాగరణ దీక్ష చేపట్టడంతో పాటు పోలీస్ విధులను అడ్డుకోవడంతో బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈరోజు కరీంనగర్ కోర్టులో బండిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.