Adilabad, May 05: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith Shah) లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ ఎస్పీయం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా నాగోబా, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి నమస్కరిస్తూ అమిత్ షా ఉపన్యాసం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రిజర్వేషన్లపై నా వీడియోను సీఎం రేవంత్ రెడ్డి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. దేశంలో రిజర్వేషన్ (Reservations) మార్చే ప్రసక్తి లేదని, ఇది మోడీ గ్యారంటీ (Modi Guarantee ) అంటూ భరోసా ఇచ్చారు. తెలంగాణలో ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకుంటోందని చెప్పారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కాబోతున్నారని, వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని అమిత్ షా జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో 12 లక్షల కోట్లు లూటీ చేసిందని ఆరోపించారు. మూడు సార్లు సీఎం, రెండుసార్లు పీఎంగా మోదీపై ఒక్క అవినీతి మచ్చ కూడా లేదన్నారు.
#WATCH | Telangana: During a public rally in Nizamabad, Union Home Minister Amit Shah says, " Congress said that if PM Modi comes to power, reservation will be removed...PM Modi has been in power for the last 10 years...he utilised the majority for removing Article 370, to end… pic.twitter.com/A6xPgcHPzw
— ANI (@ANI) May 5, 2024
“ఒక్క వైపు కోట్లాధిపతి రాహుల్ బాబా.. మరో వైపు చాయి వాలా మోదీ.. గరిబోళ్ళకు న్యాయం చేసే మోదీ కావాలా.. దోచుకునే రాహుల్ కావాలా ” అంటూ ప్రజలను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించి.. బాల రామున్ని ప్రతిష్టించిన ఘనత మోదీదేనన్నారు. కాంగ్రెస్ వాళ్ళ ఓటు బ్యాంకు మైనారిటీలు మాత్రమేనని, అందుకే కాంగ్రెస్ ఓవైసితో కలిసి ఉంటుందని విమర్శించారు.
Muslim reservation is unconstitutional!
When we stated that we would abolish any such policy, they morphed our videos and started spreading rumors that we would take away reservations for SCs, STs, and OBCs.
- Shri @AmitShah pic.twitter.com/HM3DDf1qKJ
— BJP (@BJP4India) May 5, 2024
ఇవాళ మోదీ హయాంలో కాశ్మీర్‌లో జాతీయపతాకం రెపరెపలాడుతుందోని, సోనియా, మన్మోహన్‌ల పదేళ్ల ప్రభుత్వం అల్లర్లు గొడవలతోనే నడిచిందని దుయ్యబట్టారు. అదే మోదీ ప్రభుత్వం తీవ్రవాదులు, మావోయిస్టుల భరతం పట్డిందన్నారు. దయాది దేశమైన పాకిస్తాన్‌కు మోదీ చుక్కలు చూపించారని చెప్పారు.టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తుమ్ముడిహెట్టి ప్రాజెక్టును మరిచిపోయారని అమిత్ షా విమర్శించారు. రాహుల్ ప్రభుత్వం వస్తే ట్రిపుల్ తలాక్ ఎత్తి వేస్తాడన్న ఆయన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.