KCR

Hyderabad, July 23: మండలిలో బీఆర్‌ఎస్‌ పక్షనేతగా మధుసూదనాచారిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే నా కుమార్తెను జైలులోపెట్టారట్టాని ఆరోపించారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అంటూ ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితులు ఏమీ లేని.. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణను సాధించామని స్పష్టం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదా? అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే బాగా ఎదుగుతారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయిందని.. పాలనపై దృష్టి పెట్టకుండా అభాసుపాలు చేసే పనిలోనే ఉన్నారని విమర్శించారు.

 

శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పుతున్నాయని నిలదీశారు. ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారని.. పార్టీ వదిలి వెళ్లేవారిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు.