Mahabubabad, May 01: తన ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన నిషేధంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. నాపై ఎలక్షన్ కమిషన్ నిషేధ ఆంక్షలు విధించిందన్న కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నా పేగులు మెడలో వేసుకుంటా అన్నాడు. మరి ఆయనపై ఎలాంటి నిషేధం విధించలేదు అని వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ లో రోడ్ షో లో కేసీఆర్ మాట్లాడారు. ”ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాపై నిషేధం విధించింది. 48 గంటలు ప్రచారం చేయొద్దరి, ప్రచారంలో పాల్గొనవద్దని నామీద బ్యాన్ (Elections Commission Ban) విధించింది. మీ అందరిని నేను ఒక్కటే కోరుతున్నా. ఇదే రేవంత్ రెడ్డి.. నీ పేగులు మెడలో వేసుకుంటా, నీ గుడ్లు పీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే.. ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు. కానీ, నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెబుతున్నా.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, బీఆర్ఎస్ బిడ్డలంతా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తారని నేను మనవి చేస్తున్నా” అని కేసీఆర్ అన్నారు.
ఎన్నికల కమీషన్ 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే..
లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తరు.
మహబూబాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ @KCRBRSPresident#VoteForCar #KCRBusTour #LokSabhaElections2024 pic.twitter.com/FMlNrWaEEO
— BRS Party (@BRSparty) May 1, 2024
”రాష్ట్ర ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తా అంటుంది. ఈ జిల్లా ఉండాలంటే ఈ ముఖ్యమంత్రి మెడలు వంచాలి. ఇక్కడ మాలోతు కవిత గెలవాలి. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటోంది. ఉచిత బస్సు వల్ల ఆటోవాలాల ఆత్మహత్యలు పెరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలి.
మోడీ మన గోదావరిని ఎత్తుకపోతా అంటుంటే ముఖ్యమంత్రి ముడుసుకొని కూర్చున్నారు. ఎనిమిదేళ్లు నడిచిన కరెంట్, నీళ్ళు ఎక్కడ పోయాయి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎలా ఉండేది..? ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించండి. నా ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వను. ఎన్నికల కమిషన్ నిషేధం వల్ల ఎక్కువగా మాట్లాడలేక పోతున్నా” అని కేసీఆర్ అన్నారు.
The #EC bars #KCR garu from holding any public meetings, public processions, public rallies, shows and even interviews or even public utterances in the media in connection with ongoing elections for 48 hours from 8 pm on 1st May. This for KCR garu calling this Govt "Latkoor". All… pic.twitter.com/mRBbi4Pt6q
— Karthik Reddy Patlolla (@KarthikIndrAnna) May 1, 2024
కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులతో రోడ్ షో సమయాన్ని కుదించుకున్నారు కేసీఆర్. మహబూబాబాద్ జిల్లా కేంద్రం రోడ్ షోలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన రాత్రి 8 గంటల లోపు ప్రసంగాన్ని పూర్తి చేశారు. కాగా, కేసీఆర్ రోడ్ షోకు భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. సభలో కేసీఆర్ తక్కువ సమయం మాట్లాడడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశకు గురయ్యాయి.