Hyderabad, May 11: ఢిల్లీ లిక్కర్ స్కాంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) అనేది నరేంద్ర మోదీ (Modi) సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం అని కేసీఆర్ తెలిపారు. ఈ కేసులో కవిత (Kavitha) కడిగిన ముత్యంలా బయటకు వస్తదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది నరేంద్ర మోదీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. ఇది రివర్స్ పొలిటికల్ స్కాం. అందులో ఏం లేదు అంత వట్టిదే గ్యాస్. ఇవాళ్టి వరకు ఒక రూపాయి రికవరీ చేయలేదు. ఎవర్నీ నుంచి ఎవరికి మనీ ల్యాండరింగ్ అయిందో, ఎవడి నుంచి ఎవరు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కాం కింద చిత్రీకరించారు. నేను, అరవింద్ కేజ్రీవాల్ మోదీకి కంటిలో నలుసులాగా ఉన్నాం. ముక్కులో కొయ్యలాగా ఉంటిమి మేం.
తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిద్దాం..
కాంగ్రెస్ - బీజేపీ ఢిల్లీ గులాంలకు బుద్ధి చెబుదాం.
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ #VoteForCar#LokSabhaElections2024 pic.twitter.com/Phw4UPQwBm
— BRS Party (@BRSparty) May 11, 2024
104 మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండగా, మజ్లిస్ ఎమ్మెల్యేలు ఏడుగురు మాకు సపోర్ట్ ఉన్న టైంలో 119లో 111 మందిమి ఉన్నాం మేం. అయినా ఆయన ఏజెంట్లను రాష్ట్రానికి పంపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పి మోదీ ఏజెంట్లను పంపించారు. వాళ్లను పట్టి నిర్బంధించి వారిని జైల్లో వేశాను. ఆ ఏజెంట్లను పంపించిన మూలసూత్రధారి బీఎల్ సంతోష్ ప్రధాని మోదీకి రైట్ హ్యాండ్. జాతీయ కార్యదర్శి. ఆయనను పట్టుకురమ్మని చెప్పి ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్ ఆఫీసుకు మన పోలీసులను పంపించాను. ఆయనను పట్టుకురావడానికి తెలంగాణ పోలీసులు పోయారు. తప్పించుకున్నాడు ఆయన అని కేసీఆర్ తెలిపారు.
Live: BRS Chief KCR addressing the media at Telangana Bhavan, Hyderabad.@KCRBRSPresident#VoteForCar #LokSabhaElections2024 https://t.co/4KMeN6HiZa
— BRS Party (@BRSparty) May 11, 2024
అది ఆయనకు మా మీద కోపం. ఆ కక్షను మనసులో పెట్టుకుని అటు అరవింద్ కేజ్రీవాల్‌ను, ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి కేజ్రీవాల్‌ను, నా కూతుర్ని అరెస్టు చేశారు. వాళ్లు కడిగిన ముత్యాల్లాగా బయటకు వస్తారు. స్కాం లేదు అది వట్టి ట్రాష్. అది బూమరాంగ్ అయితున్నది. ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసింది. అమెరికా నుంచి వచ్చి తన జీవితాన్ని వదులుకొని తెలంగాణ కోసం పని చేసిన బిడ్డ. ఆమె స్టాండర్డ్ ఏంటో అందరికీ తెలుసు. ఆమె మాట్లాడే విధానం, ప్రవర్తన మీ అందరికి తెలుసు. నిర్దోషిని పట్టుకుపోయి ఒక మహిళ అని చూడకుండా.. కేవలం నా కూతురు అనే రాజకీయ కక్షతోని మోదీ అరెస్టు చేసిండు. ఏం ఫరాక్ పడదు. రాజకీయ కుటుంబం కాబట్టి మేం భయపడం. మేం అన్ని ఎదర్కొంటాం. జైళ్లు బియిళ్లు కొత్త కాదు. నాట్ వర్రీ.. ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తది అని కేసీఆర్ స్పష్టం చేశారు.