BRS Manifesto: ఆసరా పెన్షన్ రూ. 5000కు పెంపు, గ్యాస్ సిలిండర్ రూ. 400, రైతు బంధు రూ. 16 వేలకు పెంపు.. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ మానిఫెస్టో..
cm kcr

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ వేగం పెంచింది. ఆదివారం గులాబీ దళపతి కేసీఆర్ రంగంలోకి దిగారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థులతో పార్టీ అధినేత కెసిఆర్ సమావేశమై అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఇందులో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బిసిలు, మైనార్టీలకు పెద్ద పీట వేస్తూ సీఎం కేసీఆర్ హామీలు అందించారు. ఇందులో ఆసరా ఫించన్లు, రైతుబంధు సాయం పెంపు, 5 లక్షల బీమా పథకం లాంటి అనేక ఆకర్షించే పలు హామీలు ఉన్నాయి.

బీఆర్ఎస్ మానిఫెస్టోలో హామీలు ఇవే..

- తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా కల్పిస్తాం

- రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తాం

- ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ. 5016 పెంపు. అధికారంలోకి మొదటి సంవత్సరం రూ. 3016 చేసి 5 సంవత్సరాల్లో రూ. 5016 చేస్తాం.

- వికలాంగుల పెన్షన్ రూ.4016 నుండి రూ.6016 పెంపు

- రైతు బంధు పథకం ఎకరానికి రూ.10,000 నుండి రూ.16,000 వేలకు పెంపు. మొదటి సంవత్సరం ఎకరానికి రూ.12,000 చొప్పున ఇచ్చి పెంచుతూ రూ.16,000 ఇస్తాం.

- అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3000 అందిస్తాం

- అర్హులైన లబ్దిదారులకు, అక్రిడేశన్ కలిగిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్

- జర్నలిస్టులకు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఉచిత వైద్యం అందేలా చేస్తాం. ప్రభుత్వం ఆసుపత్రిలో బిల్లులు కడుతుంది

- 'కేసీఆర్ ఆరోగ్య రక్ష' పేరుతో... జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు వైద్యం

- అగ్రవర్ణ పేద పిల్లలకు' 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయం