Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. లైవ్ వీడియో
Kalvakuntla Kavitha | File Image

Newdelhi, March 11: లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ బయల్దేరారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలతో భద్రతను పెంచడమే కాక... 144 సెక్షను విధించారు. పరిసర ప్రాంతాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. తన లాయర్ తో కలిసి కవిత విచారణకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, లిక్కర్ వ్యాపారి రామచంద్రపిళ్లైతో కలిపి ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

మరింత తాజా సమాచారం కోసం లైవ్ వీడియో చూడండి..

నిందితులతో కలిపి విచారణ!

ఇవాళ ఈడీ అధికారులు... లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారితో కలిపి కవితను ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురిని ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ప్రశ్నించే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఎవరు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇస్తున్నారో అధికారులు నమోదు చేసుకుంటారు. ఎవరైనా తప్పుడు సమాధానాలు చెబుతున్నట్లు అనిపిస్తే.. ఈడీ అధికారులు తమ దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపిస్తూ ప్రశ్నించే అవకాశం ఉంది. తద్వారా తప్పు చేసినట్లు నిందితులతోనే చెప్పించాలనేది ఈడీ వ్యూహంగా తెలుస్తోంది. ఐతే.. ఇవాళ కవితను ఎంతసేపు ప్రశ్నిస్తారన్నది తెలియలేదు.

కవితకు అండగా కేటీఆర్

కవితను నిజంగానే ఇవాళ అరెస్టు చేస్తారో లేదోగానీ.. ఊహాగానాలు వెలువడుతుండటంతో... మంత్రులు కేటీఆర్ , హరీశ్ రావులు నిన్న హడావుడిగా ఢిల్లీ వెళ్లారు. ఇవాళ, రేపు కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీలోనే ఉంటారని తెలిసింది. ఈ కేసును న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కేటీఆర్... న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటారని తెలిసింది. అయితే కవిత విచారణ నేపథ్యంలో మరో ఏడుగురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అభిషేక్ సోదరుడితో పాటు విజయ నాయర్ ఫ్రెండ్ మనీష్, వ్యక్తిగత సిబ్బందికి పీఎంఎల్ఏ సెక్షన్ 50/2 కింద నోటీసులు ఇచ్చారు. రానున్న వారం రోజుల్లో వీరిని ఈడీ విచారించనుంది. కవిత విచారణ నేపథ్యంలో ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది.