mla padma rao

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్‌ నేత టి పద్మారావు గౌడ్‌ను బీఆర్‌ఎస్‌ బరిలోకి దించనుంది. ఈ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆయన పేరును శనివారం ప్రకటించారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన పార్టీ శాసనసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాత పద్మారావు పేరును ఖరారు చేశారు.  పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధతకలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను బరిలోకి దింపాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.