CM KCR

రాబోయే వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి జీవో విడుదల చేస్తామని, సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల‌ ఆత్మీయ స‌భ నిర్వ‌హించారు. ఈ ఆత్మీయ స‌భ‌కు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి గిరిజ‌నులు, ఆదివాసీలు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. కుమ్రం భీం, సంత్ సేవాలాల్ విగ్ర‌హాల‌కు సీఎం కేసీఆర్ పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

అనంత‌రం గిరిజ‌నుల‌ను, ఆదివాసీల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు. గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు విష‌యంలో కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయాం. ఇక విసిగి పోద‌ల్చుకోలేదు. మేం వారం రోజుల్లో గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించారు. ఈ జీవోను గౌరవిస్తావా? దాన్నే నీవు నీ ఉరితాడుగా మార్చుకుంటావా? అని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

చైనాలో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 42 అంతస్తుల టెలికం భవనం.. వీడియో ఇదిగో!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న‌ప్పుడు మ‌న గిరిజ‌న జాతి 6 శాతం రిజ‌ర్వేష‌న్లు పొందింది. ఆ రిజ‌ర్వేష‌న్ల‌ను 10 శాతానికి పెంచాల‌ని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఏడు సంవ‌త్స‌రాలు గ‌డించింది. ప్ర‌ధాని మోదీని అడుగుతున్న‌ప్ప‌టికీ స్పంద‌న లేదు. విభ‌జ‌న రాజ‌కీయాలు మొద‌లు పెట్టిన‌ అమిత్ షాను అడుగుతున్నాం.

మీకేం అడ్డం వ‌స్తుంది. ఎందుకు ఆపుతున్నారు. రాష్ట్ర‌ప‌తి ఆమోదం చేసి పంపిస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుద‌ల చేస్తాం. బ్ర‌హ్మాండంగా రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతాయి. ఎందుకు తొక్కిపెడుతున్నారు. చేతులు జోడించి మోదీని అభ్య‌ర్థిస్తున్నా. మా బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ముద్ర వేసి పంపించండి అని కోరుతున్నా. రాష్ట్ర‌ప‌తిగా కూడా ఆదివాసీ బిడ్డ‌నే ఉన్నారు. ఆమె బిల్లును ఆపక‌పోవ‌చ్చు. విద్వేష రాజకీయాలను బద్ధలు కొట్టాలి అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.