Hyderabad January 19: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు(Telangana Govt employees) సంబంధించిన డీఏ(DA) ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2021, జులై 1 నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. 10.01 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్(Telangana green Signal) ఇచ్చింది. ఈ నెల నుంచి వేతనంతో పాటు పెరిగిన డీఏ వర్తించనుంది. 2021, జులై నుంచి బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయనున్నారు. మంత్రివర్గ భేటీ నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల డీఏ చెల్లింపుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల(కరువు భత్యం) కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజాగా ఆ మూడు డీఏల చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.