summer

Hyderabad, FEB 02:  తెలంగాణ వ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు (Temperatures) గణనీయంగా పెరిగాయి. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే అన్ని జిల్లాల్లో 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 36.5, భధ్రాద్రి-కొత్తగూడెంలో 35.6, హనుమకొండ, హైదరాబాద్‌లో 34 డిగ్రీలు నమోదయ్యాయి.

Fire Accident At Uppal Bhagayat: ఉప్పల్ భగాయత్ సమీపంలో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో మూర్ఫీ కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం.. వీడియో 

ఖమ్మంలో 34.6, మహబూబ్‌నగర్‌ 36.1,మెదక్‌ 34.8, నల్లగొండలో 31.5, నిజామాబాద్‌లో 34.5, రామగుండంలో 34 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే వారం రోజులు ఇదే వాతావరణం (Weather) ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది.