Hyderabad, Feb 16: ముచ్చింతల్ లో ఇటీవల ఆవిష్కరించిన సమతామూర్తిని (Samatamoorthy) దర్శించుకునేందుకు నేటి(బుధవారం) నుంచి సామాన్య భక్తులకు అనుమతించనున్నారు. సమతామూర్తితో పాటూ,108 దివ్యదేశాల సందర్శనకు (devotees will be allowed ) మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు అనుమతించనున్నారు. ప్రస్తుతానికి రామానుజాచార్యుల స్వర్ణమూర్తి దర్శనానికి అనుమతించడంలేదు. సమతామూర్తి దర్శన కోసం పెద్దలకు రూ. 150, పెద్దలకు రూ. 75 వసూలు చేయనున్నారు. సాంకేతిక కారణాలతో త్రీడీ మ్యాపింగ్ షో (3D maping Show) తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పారు. త్వరలో స్వర్ణమూర్తి దర్శనంతో పాటు త్రీడీ లేజర్‌షో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ నెల 2 నుంచి రామానుజ సహశ్రాబ్ది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ముచ్చింతల్ (Muchinthal)లోని శ్రీరామనగరం అధ్యాత్మక వాతావరణంలో మునిగిపోయింది. ఫిబ్రవరి 02వ తేదీ 261 సువర్ణ సమతామూర్తిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)లోకార్పణం చేశారు.
ఇక సోమవారం ముగింపులో భాగంగా… యాగశాలల వద్ద మహా పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం 108 దివ్యదేశాల దేవతామూర్తులకు శాంతికల్యాణం నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ పర్యవేక్షణలో రామానుజాచార్యుల సువర్ణమూర్తికి ప్రాణప్రతిష్ట, కుంభాభిషేకం చేశారు. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది అంతస్తులో 54 అడుగుల ఎత్తులో దీనిని కొలువుదీర్చారు. ఈ అంతస్తును శరణాగత మండపంగా పిలుస్తారు. విగ్రహాన్ని పూర్తిగా ముచ్చింతల్ లోని జీవా ఆశ్రమంలోనే తయారు చేశారు. ఎందరో భక్తులు ఇచ్చిన విరాళాలతో 54 అంగుళాల సువర్ణ ప్రతిమను రూపొందించారు. విగ్రహం వెనుక ఉండే మకరతోరణాన్ని వెండితో తయారు చేయించారు. ఆదివారం శ్రీ భగవత్ రామానుజాచార్యుల 120 కిలోల స్వర్ణమూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind) లోకార్పణం చేశారు.
స్వర్ణమూర్తికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్‌తో కలిసి తొలిపూజ చేశారు. రాష్ట్రపతి కుటుంబానికి 120 కేజీల సువర్ణమూర్తి విశిష్టతలను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వివరించారు. 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. రాష్ట్రపతి దంపతులకు రామానుజాచార్యుల ప్రతిమను బహూకరించి త్రిదండి చిన్నజీయర్‌స్వామి, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సత్కరించారు.