Credits: TRS Twitter Fan Page

Hyderabad, NOV 24: తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డిపై (Mallareddy) ఐటీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటూ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు (IT Raids) చేశారు. కాగా, ఈ తనిఖీల్లో రెండు రోజుల్లో భారీగా డబ్బు సీజ్ (Money seize) చేశారు అధికారులు. ఐటీ సోదాలు ముగిసిన తర్వాత అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. ఐటీ అధికారులు తన కుమారులతో అక్రమంగా సంతకాలు చేయించుకున్నారంటూ మంత్రి ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారితో కలిసి బోయినపల్లి పోలీస్‌ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. అటు ఐటీ అధికారులు కూడా మల్లారెడ్డిపై రివర్స్ కంప్లైంట్ ఇచ్చారు. తమ విధులకు ఆటంకం కలిగించారని, తమతో దురుసుగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఐటీ సోదాల్లో దొరికిన నగదు, డాక్యుమెంట్లకు సంబంధించి ఆయన్ను విచారణకు రావాలని ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో సోమవారం నాడు ఆయన విచారణకు హాజరుకానున్నారు.

Telangana: వైరల్ వీడియో, బూతు తిడుతూ జిల్లా స్థాయి అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన 

మరోవైపు మల్లారెడ్డి పీఏ సంతోష్ రెడ్డి (Santhosh reddy) నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రెండు రోజుల పాటు తనిఖీలు చేసిన ఐటీ బృందాలు.. సంతోష్ రెడ్డి ఇంటి నుంచి నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ రెడ్డి స్టేట్ మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. అటు బాలానగర్ లోని క్రాంతి బ్యాంక్ లో వరుసగా రెండో రోజూ ఐటీ తనిఖీలు కంటిన్యూ అయ్యాయి. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తెను బ్యాంకుకి తీసుకెళ్లారు అధికారులు. బ్యాంకు లాకర్ తెరిచేందుకు ప్రయత్నించినా.. లాకర్ (Locker) తాళాలు తీసుకుని రాకపోవడంతో బ్యాంకు నుంచి వెనుదిరిగారు ఐటీ ఆఫీసర్లు.

Shashidhar Reddy Quits Congress: రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతోంది, కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా, లేఖలో ఘాటు వ్యాఖ్యలు 

హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన దాదాపు 400 మంది అధికారులు 65 బృందాలుగా విడిపోయి ఈ సోదాల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల ఈ రాత్రికి ముగియనుండగా, ఇంకొన్ని చోట్ల గురువారం కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు ఐటీ అధికారులు. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినట్టు గుర్తించినట్టు చెప్పారు.

లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించడంతో పాటు మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చిస్తున్నట్టు ఆధారాలు సేకరించామన్నారు. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువకు తక్కువగా చూపించారని అన్నారు. మంత్రి వియ్యంకుడు వర్ధమాన్ కళాశాలలో డైరెక్టర్‌గా ఉండడంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు తెలిపారు. తన ఆస్తులపై ఐటీ అధికారులు చేస్తున్న దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. అన్ని అనుమతులతోనే ఆసుపత్రులు, కళాశాలలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వాటి ఆస్తుల వివరాలను అధికారులకు అందజేశామని, వారికి సహకరిస్తున్నామని అన్నారు. ఐటీ దాడుల వల్ల తనకు గానీ, తన కుమారులకు గానీ ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు.