
మహారాష్ట్రలో పాలన మారిన తర్వాత తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన కార్యకలాపాలను పెంచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన రూ.96.2 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడం టీఆర్‌ఎస్‌కు మింగుడు పడడం లేదు.
ఖమ్మం ఎంపీపై చర్యలు తీసుకున్న తర్వాత ఇతర ఫిర్యాదులపై ఈడీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య నెలకొన్న ఉత్కంఠను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, కేంద్రం ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, కోమెట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు.